ఆపద మొక్కుల వాడు

రచన - నాగ సాయి రమ్య 

సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అవతారంగా కొలవబడే శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయం తిరుమల తిరుపతి దేవస్థానం. హైదరాబాద్ నుండి ఆరువందల కిలోమీటర్ల దూరం లో మద్రాసు నుండి కేవలం నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం లో చిత్తూరు జిల్లాలో తిరుపతి ఉంది. తమిళంలో తిరు అంటే పవిత్రం అని మల అంటే కొండ అని అర్ధం. ఇక సంస్కృతం లో వెం అంటే పాపం అని కట అంటే నాశనం అని అర్ధం. కాబట్టి వెంకటేశ్వర స్వామి తనని దర్శించుకుంటే ఎన్ని పాపాలనైనా తుడిచి పెట్టేస్తాడు అన్నది భక్తుల నమ్మకం. 

తిరుపతి వెంకన్న ఏడుకొండలవాడిగా ప్రసిద్ది చెందాడు. అయితే ఈ కొండలు సైతం ఆ శ్రీ మహా విష్ణువు తల దగ్గర ఉండే ఆదిశేషుడి అవతారమని పురాణాలు చెప్తున్నాయి. అంటే, అక్కడితో ఆదిశేషుడు శేషాచలం గా మారిపోయాడు. ఈ ఏడు కొండలు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషబాద్రి, నారాయణాద్రి మరియు వేంకటాద్రి అనే నామాలతో పిలువబడతాయి. వేంకటాద్రి కొండ మీదే ఆలయం ఉంటుంది కాబట్టి వేంకటగిరి, వెంకటచలం అనే నామాలతో కూడా ఈ కొండ ప్రసిద్ది చెందింది. తిరుపతి వెంకన్నను బాలాజీ, గోవింద, శ్రీనివాస అనే నామాలతో కూడా భక్తులు కొలుస్తారు. తిరుపతి ఆలయం శ్రీ స్వామి పుష్కరిణి అనే  పిలువబడే నది  ఒడ్డున ఉంది. దేవాలయంలో వెంకన్నను దర్శించుకోవడానికి వీలుగా ఇప్పుడు చాలా వరకు క్యూ వంటి సదుపాయాలను ఎక్కువ సమకూర్చారు తితిదే సభ్యులు. 

కేరళలో ఉన్న తిరువనంతపురం తర్వాత అంతర్జాతీయంగా అంతే ప్రసిద్ది చెందిన ఆలయం ఇదే. ఈ ఆలయాన్ని రోజుకు యాభై నుండి లక్షమంది భక్తులు దర్శించుకుంటారని, ఆ భక్తుల సంఖ్య సంవత్సరానికి సుమారు ముప్పై నుండి నలభై మిలియన్లు వరకు ఉంటుందని ఆలయ తితిదే సభ్యుల అంచనా. బ్రహ్మోత్సవం లాంటి పుణ్యదినాలలో మాత్రం ఆలయ సందర్శకుల సంఖ్య అయిదు లక్షలకు చేరి ప్రపంచంలోనే అతి పవిత్రమైన ఆలయంగా ప్రసిద్ది చెందుతుంది. 

ఈ ఆలయం లో ఉన్న వెంకన్న కలియుగ దైవంగా ప్రసిద్ది చెందాడు. 

*****
ఈ సంచికలోని ఇతర రచనలు 





1 comment:

  1. తిరుమల తర్వాతే తిరువనంతపురమని నాభావన. good article

    ReplyDelete