త్రిమూర్తులు


రచన : శర్మ జీ ఎస్

" బ్రహ్మ "
( పుట్టుట)

సరస్వతీ బ్రహ్మలే ప్రతి సృష్టికీ మూలకారకులట ,
యిరువురూ భార్యాభర్తలట
సృష్టికి యిరువురూ అవసరమేనట ,
ఆలు మగలు అపుడపుడు స్థానాలు మారినా ,
తప్పు కాదట , తప్పు లేదట ,
ఒకరి మాట ఒకరు  మాత్రం ,
తప్పక వినుకోవాలట ,
వీళ్ళ మాటలు మరెవ్వరూ వినకూడదట ,
సందర్భానుసారంగా సలహాలివ్వవలెనట
సమయానుకూలంగా మసులుకోవాలట .

*******

" విష్ణువు "
( పెరుగుట )
ప్రపంచ పోషణకారులు ,
శ్రీ లక్ష్మీ విష్ణు మూర్తులట ,
వారిరువురూ భార్యా భర్తలట ,
యిరువురూ లేనిదే
ప్రపంచమే ముందుకు సాగదట ,
మన మానవ మనుగడకి ,
అలాంటి ఆలుమగలే పోషణకారులట ,  
ఎంత ధనానికి అధిపతి అయినా ,
భార్య  మాత్రం భర్తను ,
సేవించుకుంటూనే వుండాలట .

*******


" మహేశ్వరుడు "
( గిట్టుట )

అర్ధాంగికి అర్ధ భాగమిచ్చాడని ,  
అర్ధనారీశ్వరుడన్నారట ,
అందఱినీ తన పిల్లలుగా చూస్తారట
ఆనందమైన దాంపత్యానికి ప్రతీకలట 
అవసరమైనపుడు సర్దుకుపోవాలట ,
తమకెంతటి శక్తి సామర్ధ్యాలున్నా ,
దుష్ట సంహారానికి ,
సహవాసులను కూడా ,
భాగస్వాములను చేయాలట ,
అటువంటి ,
ఆది దంపతులే మనకు ,
ఆదర్శమూర్తులయ్యారు , 
 ఆది దంపతులే  
పార్వతీ పరమేశ్వరులట ,
ఆనందమైన దాంపత్యానికి ప్రతీకలట ,
చరాచర జగత్తుకు మూలపురుషులట .

*******

చిన్న మనవి : వీళ్ళందరిని మన జీవన మనుగడకు ఆదర్శంగా తీసుకొనాలి . అపుడే మనం    చేసే పూజలకు అర్ధం , లేకుంటే అన్నీ అనర్ధాలే స్వార్ధపరత్వంతో .




No comments:

Post a Comment